క్యారట్, రవ్వ లడ్డు

రవ్వలడ్డు అందరికి తెలిసిన వంటకమే. దాదాపు అందరి ఇళ్లల్లో ఉండే ఉప్మారవ్వతో నిముషాల్లో ఈ స్వీట్ చేసుకోవచ్చు.  ఆ రవ్వలడ్డును మరింత ఆరోగ్యకరంగా చేద్దాం.

కావలసిన వస్తువులు:

రవ్వ – 1 కప్పు

పంచదార – 3/4 కప్పు

క్యారట్ తురుము – 1/4 కప్పు

నెయ్యి – 1/4 కప్పు

పాలు – 1/4 కప్పు

యాలకుల పొడి – 1 tsp

 

పంచదార, యాలకులు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ప్యాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి క్యారట్ తురుము వేసి తడి పోయేవరకు నిదానంగా వేయించాలి. అది తీసి పక్కనపెట్టి మరో మూడు చెంచాల నెయ్యి కరిగించి రవ్వను వేసి దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. ఒక గిన్నెలో ఈ వేయించిన రవ్వ , క్యారట్ తురుము వేసి , పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఇందులో మిగిలిన నెయ్యి కరిగించి వేసి కలిపి ఉండలు కట్టుకోవాలి. ఒకవేళ ఉండలు కట్టడం రాకుంటే మరి కొంచం నెయ్యి వేసుకోవచ్చు లేదా పాలు చిలకరిస్తూ ఉండలు కట్టుకుని ఆరనివ్వాలి. అరగంట తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి.

 

Read this post in English:

You may also like...

1 Response

  1. అమల says:

    ఈ స్వీట్ తింటే మీకు పొట్టనిండా రోగాలు ఖాయం. అంతేకాదు. మీకు పెళ్లి కానట్లయితే… రేపు మీకు కలిగే సంతానానికి కూడా మీ నుంచి ఆ రోగాలు వాళ్లకు సంక్రమించే ప్రమాదం కూడా ఉంది. వాళ్లు జీవితంలో స్వీట్ తినకున్నా ఒక వయస్సులో మధుమేహం వ్యాధికి గురికాక తప్పదు. ఇలాంటి స్వీట్లు మీరెందుకు తినాలి, మీ భవిష్యత్ సంతానాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. ఒక కప్పు రవ్వకు ఎక్కడైనా ముప్పావు కప్పు పంచదార కలుపుతారా. ఇది సరిపోదన్నట్లు పావు కప్పు నెయ్యి కూడా కలపాలంట. పావు కప్పు నెయ్యి అంటే సుమారు ఒకటింపావు కప్పు వెన్నతో సమానం అన్నమాట. అన్నంలో కాసింత వెన్న వేసుకో తల్లీ అంటే అమ్మో.. లావెక్కిపోతానని జాగ్రత్తలు తీసుకునే నేటి ఆడపిల్లలు ఇలాంటి లడ్డూలు అమాయకంగా తినేస్తే ఇంకేమైనా ఉందా… వాళ్లకు తెలీకుండానే మళ్లీ ఇంచు మందం కూడా తగ్గనంత బాగా లావెక్కిపోరూ… పైగా ఎన్ని రోగాలు వస్తాయో కూడా లెక్క దొరకదు. జాగ్రత్త సుమీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో