చల్లని సాయంకాలం. వేడివేడిగా తినాలనిపిస్తుంది. పకోడీలో, పునుకులో, బజ్జీలో.. ఎప్పుడు ఒకే వెరయిటీ ఐతే ఎలా. అందుకే ఈసారి కాస్త డిఫరెంటుగా పకోడీలు చేసుకుందాం.

కావలసిన వస్తువులు :
ఉల్లిపాయలు – 4
ఉడికించిన నూడుల్స్ – 1 కప్పు
కరివేపాకు -3 రెబ్బలు
కొత్తిమిర - 2 రెబ్బలు
పసుపు -1/4 tsp
కారం పొడి – 1 tbsp
గరం మసాలా పొడి -1 tsp
ధనియాల పొడి – 1 tbsp
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి

ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమిర. ఉడికించిన నూడుల్స్, పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా పొడి , తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ మిశ్లమాన్ని ముద్దలుగా కాకుండా పొడి పొడిగా వేయాలి. ఈ పకోడీలు నిదానంగా రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.అంతే వేడి వేడి నూడుల్స పకోడీలు రెడి. ఆవకాయ లేదా టమాట సాస్ తో సర్వ్ చేయండి.ఇట్టే మాయమవుతాయి..