February 21, 2012 at 9:00 PM
చాలా త్వరగా చేసుకోగలిగే అల్పాహారం సాండ్‌విచ్ .. మరీ హెవీగా కాకుండా. కొంచెం లైట్ గా ఉండి, ఆకలి తగ్గించేవే సాండ్‌విచ్ లు.. ఎప్పుడూ ఒకేరకం కాకుండా అప్పుడప్పుడు వెరయిటీలు చేసుకుంటే బావుంటుంది కదా. ఈ సాండ్‌విచ్

బ్రౌన్ బ్రెడ్ స్లైసులు – 4
చీజ్ స్లైసులు – 2
గ్రీన్ చట్నీ – 1/4 కప్పు
గ్రీన్ చట్నీ:
కొత్తిమిర – 1/4 కప్పు
పుదీనా – 10 ఆకులు
పచ్చిమిర్చి – 1
వెల్లుల్లి రెబ్బలు – 2
నిమ్మ రసం – 2 tsp
ఉప్పు – తగినంత
గ్రీన్ చట్నీ దినుసులన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసి నిమ్మరసం కలపాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి ఈ చట్నీని పలుచగా పూయాలి. ఒక బ్రెడ్ ముక్క మీద చీజ్ స్లైస్ లేదా చీజ్ తురుము వేసి ఇంకో చట్నీ పూసిన బ్రెడ్ స్లైస్ పెట్టాలి. కొద్దిగా వత్తి పెట్టి రెండు లేదా నాలుగు ముక్కలు చేసి సర్వ్ చేయాలి. ఇవి కొద్ది సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేస్తే బావుంటాయి.
Read this post in English:
Tags:
సాండ్ విచ్,
స్నాక్స్
February 17, 2012 at 10:14 PM
మష్‌రూమ్ స్పెషల్స్ సీరీస్ లో ఈసారి ఒక మసాలా కుర్మా చేద్దామా? ఎప్పుడైనా పార్టీ మూడ్ ఉన్నప్పుడు. స్పెషల్ సందర్భాలలో పులావ్ చేసుకుని ఈ కర్రీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది..

కావలసిన వస్తువులు:
మష్‌రూమ్స్ 250 gms
పనీర్ – 200 gms
క్యాప్సికమ్ – 100 gms
ఉల్లిపాయ – 1
వెన్న – 2 tsp
నూనె – 2 tsp
పచ్చిమిర్చి – 3
టమాటా – 2
జీలకర్ర పొడి – 1 tsp
ధనియాల పొడి – 2 tsp
గరం మసాలా పొడి – 1/4 tsp
కొబ్బరి పొడి – 3 tsp
జీడిపప్పు ముద్ద – 3 tbsp
కారం పొడి – 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 tsp
కొత్తిమిర – కొద్దిగ
ఉప్పు – తగినంత
మష్‌రూమ్ అరంగుళం సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. పనీర్ అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి గోరువెచ్చని నీళ్లలో వేసి పదినిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి మృదువుగా ఉంటాయి. ప్యాన్‌లో నూనె, వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా వేపి క్యాప్సికం, టమాటా ముక్కలు వేసి వేయించాలి. కొద్దిగా వేగాక జీడిపప్పు పొడి, కొబ్బరిపొడి, గరం మసాలా, మష్‌రూమ్ ముక్కలు వేసి వేపాలి. తర్వాత పనీర్ ముక్కలు, తగినంత ఉప్పు అరకప్పు నీళ్లు పోసి మొత్తం కలిపి మూతపెట్టి నూనె తేలేవరకు ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు మంచి జోడీ..
Read this post in English:
Tags:
మష్‌రూమ్స్,
శాకాహారం,
కుర్మా
February 14, 2012 at 6:20 PM
మష్‌రూమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వాటితో ఇంకా ఏమేం చేయొచ్చంటారు?? ఎప్పుడు చేసుకునే పకోడీలలో మష్‌రూమ్స్ కలిపితే ఎలా ఉంటుంది చూద్దామా??

కావలసిన వస్తువులు:
మష్‌రూమ్స్ – 100 gms
శనగపిండి – 100 gms
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి ముద్ద – 1/4 tsp
ఉల్లిపాయ – 1
కారం పొడి – 1 tsp
ధనియాల పొడి – 1 tbsp
మెంతికూర – 1 కట్ట
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి
మష్‌రూమ్స్ శుభ్రం చేసుకుని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సెనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర, మష్‌రూమ్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేడి నూనెలో పొడి పొడిగా పకోడీల్లా వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
Read this post in English:
Tags:
పకోడీలు,
మష్‌రూమ్స్,
స్నాక్స్
February 12, 2012 at 5:12 PM
మీరు మష్‌రూమ్స్ లేదా పుట్టగొడుగుల గురించి విని ఉండొచ్చు కాని అవి భారతీయ వంటకాలలో అంత ఎక్కువగా వినియోగంలో లేవు. చైనీస్ వంటకాలలో మాత్రమే వాడతారని అందరూ అనుకుంటారు. కాని వాటిని కూడా పనీర్ లా అప్పుడప్పుడు మన వంటలలో ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా మంచిదే..

మష్‌రూమ్స్ – 100 gms
వెన్న – 2 tbsp
కార్న్ ఫ్లోర్ – 2 tbsp
పాలు – 100 ml
నీళ్లు – 300 ml
మష్‌రూమ్స్/ పుట్టగొడుగులను నీటిలో కడిగి శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరిగి కొద్దిగా పాలు, నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఒక ప్యాన్‌లో వెన్న వేడి చేసి కార్న్‌ఫ్లోర్‌ని కొద్దిగా వేపాలి. ఇందులో మిగిలిన పాలు, ఉప్పు, ఉడికించిన మష్‌రూమ్స్ నీళ్లతో పాటుగా వేసి కలుపుతూ చిక్కబడేవరకు మరిగించి దింపేయాలి. పైన కొత్తిమిర లేదా ఉల్లిపొరక సన్నగా తరిగి వేసి వేడి సర్వ్ చేయాలి.
Read this post in English:
Tags:
మష్‌రూమ్స్,
సూప్
February 11, 2012 at 8:29 PM
చలికాలంలో కాలిఫ్లవర్ తాజాగా పెద్ద సైజులో మార్కెట్లను వెల్లువెత్తుతాయి. కాలీఫ్లవర్ తో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇవాళ గ్రీన్ కుర్మా చేసుకుందాం…

కాలిఫ్లవర్ – 250 gms
పచ్చి బఠానీలు – 1/4 కప్పు
ఉల్లిపాయ – 2
పచ్చిమిర్చి – 6
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 tsp
పుదీనా, కొత్తిమిర – 1/4 కప్పు
లవంగాలు – 4
యాలకులు – 3
షాజీరా – 1/4 tsp
దాల్చిన చెక్క – చిన్న ముక్క
కొబ్బరి పొడి – 3 tsp
పెరుగు – 1/2 కప్పు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 3 tbsp
కాలిఫ్లవర్ ని చిన్న ముక్కలు చేసుకుని ఉప్పు కలిపిన వేడి నీళ్లలో వేసి పది నిమిషాలు ఉంచాలి. దీనివల్ల లోపల పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి. కొబ్బరి పొడి, పుదీనా, కొత్తిమిర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క, పసుపు, కాలిఫ్లవర్ ముక్కలు, బఠానీలు వేసి కొద్ది సేపు వేయించాలి. తర్వాత రుబ్బుకున్న మసాలా ముద్ద, పెరుగు, తగినంత ఉప్పు కూడా వేసి కలిపి మూతపెట్టి నిదానంగా నూనె తేలేవరకు ఉడికించాలి. ఈ కూర పులావ్, ఫ్రైడ్ రైస్, చపాతీలకు బావుంటుంది. ఇష్టముంటే ఇందులో వేయించిన పనీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
Read this post in English:
Tags:
కాలిఫ్లవర్,
కుర్మా,
కూరలు
February 10, 2012 at 1:48 PM
సాయంత్రాలు ఆపీసునుండి వచ్చిన పెద్దలకు, స్కూల్లు, కాలేజీలనుండి వచ్చిన పిల్లలకు ఆకలిగా ఉంటుంది. ఎక్కువసేపు ఎదురుచూడకుండా ఏదో ఒకటి తినాలని ఉంటుంది. అలా చాలా త్వరగా తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన టిఫిన్ ఈ కట్లెట్..

స్వీట్ కార్న్ – 1 కప్పు
ఆలు – 3
ఉల్లిపాయ – 1 చిన్నది
పచ్చిమిర్చి – 4
కొత్తిమిర – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – 1/4 కప్పు
ఆలు ఉడికించి చెక్కు తీసి పొడిపొడిగా మెదిపి ఉంచుకోవాలి… కార్న్ , పచ్చిమిర్చి కలిపి బరకగా గ్రైండ్ చేసుకుని బంగాళదుంపలో కలపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమిర, ఉప్పు వేసి బాగా కలియబెట్టి చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కాస్త వెడల్పుగా చేసుకోవాలి. పెనం వేడీ చెసి కొద్దిగా నూనె వేసుకుంటూ ఈ కట్లెట్లను రెండువైపులా ఎర్రగా కాల్చుకుని టొమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి. చాలా త్వరగా తయారు చేసుకునే అల్పాహారం ఇది..
Read this post in English:
Tags:
స్నాక్స్,
ఆలు,
కార్న్
February 7, 2012 at 7:14 PM
బెండకాయలతో వేపుడు, పులుసు చేసి విసుగొచ్చిందా? కాస్త వెరయిటీగా కోడిగుడ్డు వేసి కూర చేద్దాం .. బెండకాయలు తరిగి పెట్టుకుంటే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. అన్నం, రొట్టెలలోకి మంచి అధరువు ఈ కూర.

బెండకాయలు – 250 gms
గ్రుడ్లు – 2
ఉల్లిపాయ – 1
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – 1/4 tsp
కారం పొడి – 1 tsp
గరం మసాలా పొడి – 1/4 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 tsp
ఉప్పు – తగినంత
నూనె – 3 tsp
బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేపి బెండకాయ ముక్కలు వేసి నిదానంగా వేయించాలి. అవి కాస్త కరకరలాడుతున్నప్పుడు కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి చివరలో గ్రుడ్లు కొట్టి వేయాలి. లేదా విడిగా చెంచాడు నూనె వేడి చేసి గ్రుడ్లను పొడి పొడిగా చెసి కలుపుకోవచ్చు. గ్రుడ్లు ఉడికి మొత్తం కలిసేలా బాగా కలిపి రెండు నిమిషాలు వేగాక దింపేయాలి.
Read this post in English:
Tags:
బెండకాయ,
వేపుడు,
కూరలు
February 5, 2012 at 5:26 PM
బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా రక్తహీనత ఉన్నవాళ్లు పచ్చి బీట్‌రూట్ తినాలని డాక్టర్లు కూడా చెప్తుంటారు. వీటిని సూప్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకోసం వాళ్లకిష్టమైన మాక్రోనీ కూడా కలిపితే ఇంకా ఆకర్షణీయంగా, రుచిగా కూడా ఉంటుంది.

బీట్‌రూట్ – 1
మాక్రోనీ – 1/2 కప్పు
ఉల్లిపాయ – 1 చిన్నది
వెన్న – 1 tsp
మిరియాల పొడి – 1/4 tsp
కార్న్‌ఫ్లోర్ – 1 tsp
అజినొమొటొ – చిటికెడు
రెండు కప్పుల నీళ్లు మరిగించి మాక్రోనీ వేయాలి. అవి బాగా ఉడికిన తర్వాత జల్లెట్లో వేసి వడకట్టాలి. బీట్‌రూట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి , ఉల్లిపాయ ముక్కలు, మూడు కప్పుల నీళ్లు పోసి రెండు కప్పులు అయ్యేంతవరకు ఉడికించాలి. తర్వాత వడకట్టి ఉంచుకోవాలి. ప్యాన్‌లో వెన్న వేడి చేసి ఈ వడకట్టిన రసం పోయాలి. ఇందులో ఉడికించిన మాక్రోనీ, అజినొమొటొ, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించాలి. కొన్ని నీళ్లలో కార్న్‌ఫ్లోర్ కలిపి మరుగుతున్న సూప్‌లో పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొద్దిగా చిక్కబడగానే కొత్తిమిర వేసి దింపి వేడిగా సర్వ్ చేయాలి.
Read this post in English:
Tags:
పిల్లల కోసం,
బీట్‌రూట్,
మాక్రోనీ,
సూప్
February 2, 2012 at 4:56 PM
భారతదేశంలోని పలు ప్రాంతాలలో పప్పు ఒక తప్పనిసరి వంటకం. రోజు పప్పు తినేవాళ్లు చాలామంది. రాజస్ధాన్ ప్రాంతంలో విశేషంగా చేసే ప్రత్యేకమైన పప్పు పంచ్‌మేల్ దాల్ . ఒకటి కాదు ఐదురకాల పప్పులు కలిపి ఉడికించి మసాలా దినుసులు అవి కలుపుతారు. ఇదే పంచ్‌మేల్ . ఎలా చేయాలో చూద్దాం

కావలసిన వస్తువులు:
కందిపప్పు – 1/4 కప్పు
సెనగపప్పు – 1/4 కప్పు
పెసరపప్పు – 1/4 కప్పు
ఎర్రపప్పు – 1/4 కప్పు
మినప్పప్పు – 1/4 కప్పు
ఉల్లిపాయ – 1
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 tsp
జీలకర్ర పొడి – 1/2 tsp
ధనియాల పొడి – 1/2 tsp
టమాటా – 2
పచ్చిమిర్చి – 4
పసుపు – 1/4 tsp
ఆవాలు – చిటికెడు
జీలకర్ర – చిటికెడు
ఇంగువ – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 3 tsp
పప్పులన్నీ కలిపి కడిగి నీళ్లు పోసి రెంఢు గంటలు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో పప్పులు, కొద్దిగా పసుపు, నూనె తగిన నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ప్యాన్ లో నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉడికించిన పప్పును మెదిపి వేయాలి. ఇందులో తగినంత ఉప్పు కలిపి నిదానంగా మరో ఐదు నిమిషాలు ఉడికించి కొద్దిగా నెయ్యి, కొత్తిమిర వేసి వేడిగా వడ్డించాలి. ఇది అన్నం, రొట్టెలలోకి బావుంటుంది..
Read this post in English;
Tags:
పప్పు,
రాజస్ధానీ
January 30, 2012 at 9:05 PM
చికెన్, వెజ్, ఆలు, వంకాయ, మొదలైన వాటితో 65 లు చేయడం అందరికి తెలిసిందే. అరటికాయతో ముద్దకూర, వేపుడు, బజ్జీలు చేసుకుంటాం కదా. మరి వాటితోనే 65 చేస్తే ఎలా ఉంటుంది??

అరటికాయలు – 3
మైదా – 1/4 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1/4 కప్పు
తందూర్ కలర్ – చిటికెడు
మిరియాల పొడి – 1/4 tsp
కారం పొడి – 1 tsp
పచ్చిమిర్చి – 4
కరివేపాకు – 4 రెమ్మలు
అజినొమొటొ – చిటికెడు
ఉప్పు – తగినంత
పెరుగు – 1 కప్పు
నూనె – వేయించడానికి
అరటికాయ చెక్కు తీసి నిలువుగా ముక్కలు చేసి మజ్జిగ వేసిన నీళ్లలో వేసి ఉంచాలి (నల్లబడకుండా) ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, కారం పొడి, కలర్, ఉప్పు, అజినొమొటొ, మిరియాల పొడి వేసి కలిపి ఇష్టముంటే కోడిగుడ్డు లేదా కొద్దిగా నీళ్లు కలిపి పలుచగా మిశ్రమంలా చేసుకోవాలి. అరటికాయ ముక్కలను నీళ్లనుండి తీసి ఇందులో కలపాలి. మొత్తం ముక్కలన్నీ మిశ్రమంలో బాగా కలపి వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. వేరొక ప్యాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపి పెరుగు వేయాలి. కావాలంటే ఇందులో కొంచం సోయా సాస్ వేసుకోవచ్చు. వేయించిన అరటికాయ ముక్కలు వేసి పూర్తిగా ఇగిరిపోయేదాకా వేయించి వేడిగా సర్వ్ చేయాలి.
Read this post in English:
Tags:
స్నాక్స్,
కూరలు