దాల్ ఢోక్లి

అనుకోకుండా అతిధులు వచ్చినప్పుడు, పిల్లలు ఏదైనా కొత్తగా తినాలనుకున్నప్పుడు వెంటనే చేయగలిగే రుచికరమైన వంటకం ఈ దాల్ డోక్లి.  తక్కువ దినుసులతో చాలా త్వరగా చేసుకోగలిగే గుజరాతీ వంటకం ఇది..

 

కావలసిన వస్తువులు:

గోధుమ పిండి – 1/2 కప్పు

వాము – 1 tsp

పెసరపప్పు – 1/2 కప్పు

ఉల్లిపాయ -1 చిన్నది

పచ్చిమిర్చి – 3

కరివేపాకు – 1 రెబ్బ

కొత్తిమిర – కొద్దిగా

క్యారట్ ముక్కలు -2 tsp

బీన్స్ ముక్కలు – 2 tsp

పసుపు – 1/4 tsp

ఆవాలు, జీలకర్ర – 1/4 tsp

ఉప్పు – తగినంత

నూనె – 3 tsp

 

గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, అర చెంచాడు నూనె, వాము వేసి  వేసి నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి. పెసరపప్పును కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. బీన్స్, క్యారట్ ని సన్నగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కూరగాయ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి కొద్దిగా వేపాలి. ఇందులో మూడు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. తడిపిన పిండిని తీసి బాగా పిసికి ఉండలు చేసుకుని చపాతీలా వత్తుకోవాలి. చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరుగుతున్న నీళ్లలో వేసి నిదానంగా ఉడికించాలి. ఈ చపాతీ ముక్కలు, పెసరపప్పు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమిర వేసి దింపేయాలి. కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు.

 

Read this post in English:

 

You may also like...

2 Responses

  1. admin says:

    థాంక్ యూ గీత

  2. Geetha says:

    Hai andi naku mee vantalu ante chala ishtam and nenu mee tomato dokla ninna try chasanu chala bagundhi ilage meeru naku different different varieties pampistharani aashisthunnanu thank you so much

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో